Breaking News

మావోయిస్టుల బంకర్‌ స్వాధీనం.. కొత్త టెక్నాలజీతో బాంబుల తయారీ!

Published on Sat, 01/18/2025 - 07:13

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను జవాన్లు గుర్తించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తుమ్రైల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ బంకర్‌ను డీఆర్జీ జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో బంకర్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సైనికులకు హాని కలిగించే విధంగా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు నక్సలైట్లు గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. ఆయుధాలు తయారు చేసే యంత్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను గుర్తించారు.

బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేరు, మారేడుబాక అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు తెలిపారు. దీంతో, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఒక్క జనవరి నెలలోనే దాదాపు 35 మంది వరకు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో కీలక నేతలు కూడా ఉన్నారు. 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)