Breaking News

మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి

Published on Tue, 07/04/2023 - 15:19

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ‍ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్‌) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. 

మధ్యప్రదేశ్‌ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు.
చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)