Rajasthan: డ్రమ్ములో కుళ్లిన మృతదేహం.. భార్య, పిల్లలు ఏమయ్యారు?

Published on Mon, 08/18/2025 - 07:08

అల్వార్‌: రాజస్థాన్‌లోని అల్వార్‌లో కలకలంరేపే ఉదంతం చోటుచేసుకుంది. ఒక డ్ర​‍మ్ములో కుళ్లిపోయిన స్థితిలో పురుషుని మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది. ఒక ఇంటి యజమాని ఏవో పనుల కోసం తమ మొదటి అంతస్థుకు వెళ్లినప్పుడు, అక్కడ దుర్వాసన రావడాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది.

ఈ ఘటన తిజారా జిల్లాలోని ఆదర్శ్ కాలనీలో చోటుచేసుకుంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆ వ్యక్తి అని, అతను ఇటుక బట్టీలో పనిచేస్తుంటాడని, అతనిని హన్స్‌రాజ్‌గా గుర్తించామని తెలిపారు. కాగా ఈ ఘటన అనంతరం అతని భార్య, ముగ్గురు పిల్లలు  అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా ఒక నీలిరంగు డ్రమ్ములో మృతదేహాన్ని పడవేసి, దానిపై మూత ఉంచి, ఒక పెద్ద రాయిని దానిపై పెట్టారు.

‘ఆదర్శ్ కాలనీలోని ఒక ఇంటి నుండి దుర్వాసన వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు చేయగా, ఇంటి డాబాపై ఉన్న నీలిరంగు డ్రమ్ములో ఒక యువకుని మృతదేహం కనిపించింది. బాధితుడిని హన్స్‌రాజ్ అలియాస్ సూరజ్‌గా గుర్తించాం’ అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ మీడియాకు తెలిపారు.

బాధితుడు ఉత్తరప్రదేశ్ నివాసి  అని, నెలన్నర క్రితం ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడని, తన భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడని రాజేష్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం  సంఘటనా స్థలం నుండి ఆధారాలు  సేకరించింది. ఆ మృతదేహం డ్రమ్ములో ఎంతకాలం నుంచి ఉందో, అతని హత్యకు గల కారణం ఏమిటో  ఇంకా వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)