Breaking News

‘బీఎండబ్ల్యూ ప్రధాని కోసం.. నా కారు మారుతి 800’

Published on Sat, 12/28/2024 - 05:56

ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్‌సింగ్‌ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అసిమ్‌ అరుణ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. 

క్లోజ్‌ ప్రొటెక్షన్‌ టీమ్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్‌ సింగ్‌ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది  మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్‌ చేసి ఉండేది. 

కాన్వాయ్‌ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్‌. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు..  సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్జీ) బ్లాక్‌ క్యాట్‌ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్‌ అధికారి అసిమ్‌ అరుణ్‌.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)