Breaking News

లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు

Published on Mon, 06/05/2023 - 14:58

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. తన భార్య అనారోగ్యం కారణంగా ఆరు వారాలు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ సిసోడియాకు చుక్కెదురైంది. తన భార్యను చూసుకునేందుకు తానొక్కడినే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి నిరాశే మిగిలింది.  మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సిసోడియా.. మధ్యంతర బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే, భార్యను చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒకరోజు తన నివాసం వద్ద కానీ, ఆసుపత్రిలోనైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది. 

భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు శనివారం అనుమతిచ్చినప్పటికీ, సిసోడియా నివాసానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో సిసోడియా తన భార్యను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, భార్య కలిసేందుకు సిసోడియాకు కోర్టు మరో అవకాశం ఇచ్చింది.

మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే, ఇటీవల సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్యను చూడడానికి గత శుక్రవారం జైలు నుంచి బయటకు రావడానికి హైకోర్టు అనుమతించింది. అయితే.. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా మార్చి 9న అరెస్టు అయ్యారు.

ఇదీ చదవండి:బ్రిజ్‌భూషణ్‌ అరెస్ట్‌కు రెజ్లర్ల డిమాండ్‌.. లభించని అమిత్ షా హామీ

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)