Breaking News

హింసాకాండ.. మణిపూర్‌ సర్కార్‌కు కీలక ఆదేశాలు

Published on Wed, 07/26/2023 - 09:25

ఢిల్లీ: మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాకాండ పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పటివరకు ఏం చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు?.. ఇకపై ఏం చేయబోతున్నారో.. సమగ్ర నివేదిక సమర్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హింస చెలరేగకుండా చూసుకోవాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 

మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీసే ఎలాంటి హింసాకాండ జరగకుండా చూడాలని అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు అని ఎన్‌హెచ్‌ఆర్సీ ప్యానెల్‌ సదరు ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. ఇప్పటివరకు చోటు చేసుకున్న అఘాయిత్యాలకు, అకృత్యాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు వెల్లడించింది.  

మణిపూర్‌ అల్లర్లు-హింసకు సంబంధించి నుంచి రోజుకో ఘటన మా దృష్టికి వస్తోంది. ఇలాంటి తరుణంలో మేం ఓ తుది నిర్ణయం తీసుకోలేం. అందుకే వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి..  అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ఆరా తీస్తున్నాం అని మానవ హక్కుల సంఘం వెల్లడించింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని మణిపూర్‌ సర్కార్‌ను ఆదేశించాం. 

శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మధ్య సామరస్యం వెల్లివిరియడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.  అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరా తీస్తున్నాం అని సదరు ప్రకటనలో జాతీయ మానవ హక్కుల సంఘం పేర్కొంది. 

ఇక నుంచి అయినా అలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది NHRC. అలాగే.. శరణార్ధుల విషయంలో చేపడుతున్న చర్యలు, వాళ్లకు అందిస్తున్న పరిహారం మీదా ఆరా తీసింది మానవ హక్కుల సంఘం. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)