Breaking News

Manipur violence: మొయితీల వలసబాట

Published on Mon, 07/24/2023 - 04:24

గువాహటి/కోల్‌కతా: కల్లోల మణిపూర్‌లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది.

ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్‌ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్‌ గ్రూప్‌ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్‌కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు.

వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్‌ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు.  

వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం
మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్‌ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్‌ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ మాజీ మిలిటెంట్‌ గ్రూప్‌నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్‌లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పారీ్ట ఆరోపించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)