Breaking News

మణిపూర్‌లో బాంబు పేలుడు.. మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి

Published on Sun, 08/11/2024 - 16:11

ఇంపాల్‌: ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్‌లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య మృతిచెందారు. మరోవైపు.. తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకరాం.. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి సైకుల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్‌థాంగ్‌ హౌకిప్‌ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్‌ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పేలుడు ఘటన సమయంలో హౌకిప్‌ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)