Breaking News

మణిపూర్‌ అల్లర్లు.. 3 వేల మందికి రెడీమేడ్‌ ఇళ్లు

Published on Wed, 08/16/2023 - 08:08

ఇంఫాల్‌: మణిపూర్‌ అల్లర్లలో నిరాశ్రయులైన 3 వేల కుటుంబాలకు మొదటి విడతలో ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్లను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూన్‌ 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రెడీమేడ్‌ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించించింది. ఈ బాధ్యతను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. గత మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన వేలాదిమంది ప్రభుత్వం నిర్వహిస్తున్న తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

మణిపూర్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.బ్రోజెంద్రో వివరాలు వెల్లడించారు. ‘రహదారుల దిగ్బంధం కారణంగా ఇంటి సామగ్రి రవాణా కష్టంగా మారింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని విమానాల ద్వారా అక్కడికి తరలిస్తున్నాం. పశ్చిమ ఇంఫాల్‌లోని సెక్మాయ్, తూర్పు ఇంఫాల్‌లోని సవోంబుగ్‌ల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం. వైరి వర్గాల మధ్య కాల్పుల ఘటనల కారణంగా క్వాక్తా ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది’ అని చెప్పారు. 
చదవండి: బీజేపీ భారత్‌ వీడిపో

అబద్ధాలు, అతిశయోక్తులు: కాంగ్రెస్‌ 
స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. వక్రీకరణలు, అబద్ధాలు, అతిశయోక్తులు, శుష్కవాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. స్వాతంత్య్రదినోత్సవ వేళ దేశ ప్రజలందరినీ ఏకతాటికి పైకి తేవాల్సిన ప్రధాని ప్రసంగంలో తన గొప్పలు, ప్రతిష్ట గురించి చెప్పుకోవడానికే సరిపోయిందని పేర్కొంది.

స్వాతంత్య్రదినోత్సవం నాడు ప్రధాని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే భారత్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దగలరని కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందో చెప్పకుండా ఎన్నికల ప్రసంగంలా మార్చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ ఆరోపించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)