Breaking News

తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఒక ఇంట్లో ఉంటూ..

Published on Tue, 10/22/2024 - 09:08

గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని పూర్ణిమా దేవి(75)గా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితమే ఆమె మృతి చెందివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి ఈ ఇంటిలో కొన్నేళ్లుగా ఉంటోంది.  జైదీప్ దేవ్‌ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు.

మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు జైదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

పూర్ణిమా దేవి ఇంటికి సమీపంలో ఉంటున్న వారు మీడియాతో మాట్లాడుతూ మృతురాలి కుమారుడు జైదీప్‌ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అతని ప్రవర్తన వింతగా ఉండేదని తెలిపారు. అతని తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తల్లిని బయటకు రానివ్వలేదని, ఎవరైనా అడిగితే తల్లి ఆరోగ్యంగా ఉందని చెప్పేవాడన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వెంటపడిన కుక్క.. హోటల్‌ పైనుంచి పడి యువకుడు మృతి

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)