Breaking News

హెల్మెట్ ధరించలేదని ఫైన్: కారు డ్రైవర్‌ ఏం చేశాడంటే?

Published on Mon, 12/08/2025 - 22:37

సాధారణంగా టూవీలర్ నడిపేవాళ్లే హెల్మెట్ ధరిస్తారు. కానీ ఇక్కడ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్షన్ అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ (Helmet) ధరించి కనిపించారు. గతంలో హెల్మెట్ ధరించనందుకు పోలీసులు అతనికి జరిమానా విధించారని, అందుకే ఇప్పుడు హెల్మెట్ ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.

2025 నవంబర్ 26న తన ఫోర్ వీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించనందుకు పోలీసులు రూ.1,100 జరిమానా విధించారని గుల్షన్  అన్నారు. ''నేను సీట్ బెల్ట్ (Seat Belt) ధరించాను, కానీ హెల్మెట్ ధరించనందుకు పోలీసులు నాకు జరిమానా విధించారు" అని అతను చెప్పారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అందుకే జరిమానా విధించినప్పటి నుంచి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని, భవిష్యత్తులో చలాన్‌లను పొందకుండా ఉండాలంటే వేరే మార్గం లేదని అన్నారు.

ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్లకు జరిమానాలు విధించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోమారు యూపీలో అలాంటి ఘటన తెరపైకి వచ్చింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)