Breaking News

‘వందే భారత్‌’ ఢీకొని యువకుడు మృతి.. ఎక్కడంటే..

Published on Wed, 06/28/2023 - 06:55

వారణాసి నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టూండలా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జలేసర్‌-పోరా మధ్య రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇదేమీ మొదటిది కాదు..
ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా వెళుతోంది. ఈ సమయంలో ఆ యువకుడు పట్టాలు దాటుతుండగా, అటువైపుగా వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ యువకుడిని ఢీకొంది. సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. కాగా వందే భారత్‌ ఎక్సెప్రెస్‌ కారణంగా గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఇదేమీ మొదటిది కాదు. పలుమార్లు ట్రాక్‌పైకి పశువులు వచ్చిన కారణంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. అలాగే ఈ రైలు వేగం కారణంగా రైలును ఢీకొనడంతో పలు పశువులు మృతి చెందాయి.

ఐదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను స్వాగతించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఐదు వందేభారత్‌ రైళ్లను స్వాగతించారు. భోపాల్‌లో ఈ రైళ్లకు పచ్చజెండా చూపారు. వీటిలో మొదటి రైలు కమలాపతి- జబల్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌. రెండవ వందేభారత్‌ ఖజురహో నుంచి భోపాల్‌ మధ్య ఇండోర్‌ మీదుగా నడవనుంది. ఇదేవిధంగా గోవాలోని మడ్గావ్‌ నుంచి ముంబైకి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు మొదలయ్యాయి. నాల్గవ వందేభారత్‌ ధార్వాడ- బెంగళూరు మధ్య నడవనుంది.

ఇది కూడా చదవండి: బ్యాంకు డిపాజిట్‌ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)