Breaking News

సీఎం సెక్యూరిటీపై తాగుబోతు ఆరా.. తెల్లారేసరికి..

Published on Sat, 06/13/2026 - 11:55

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శనివారం ఉదయం తీవ్ర కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ ఒక వ్యక్తి  నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కే ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

అర్ధరాత్రి వచ్చిన ఆ అజ్ఞాత కాల్
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం సిటీ డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి కారణం అడగగా, ‘నాకు సతీషన్ అంటే నచ్చదు, అందుకే చంపుతా’ అంటూ  నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

పోలీసులకే సవాల్.. భద్రతపై ఆరా
అంతటితో ఆగకుండా, సదరు నిందితుడు కేవలం మూడు నిమిషాల వ్యవధిలో, అంటే సాయంత్రం 6:53 గంటలకు మరోసారి ఫోన్ చేసి, మళ్లీ బెదిరించాడు. కాల్ మాట్లాడిన పోలీస్ అధికారిని అసభ్య పదజాలంతో దూషించాడు. పైగా, ‘ముఖ్యమంత్రికి మీరు సరైన రక్షణ ఏర్పాట్లు చేశారా లేదా?’ అంటూ పోలీసులను అడిగాడు.

మద్యం మత్తులో నిందితుడు
ఈ ఘటనపై కంటోన్మెంట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అట్టింగల్‌కు చెందిన సోనీ థామస్‌గా గుర్తించారు. శనివారం ఉదయం నిందితుడిని పోలీసులు పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఫోన్ చేసే సమయంలో నిందితుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అతడిని రిమాండ్ నిమిత్తం త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)