రీల్‌ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్‌.. యువకుడు మృతి

Published on Sun, 06/23/2024 - 12:26

‘రీల్స్‌ చెయ్యాలి... సోషల్‌ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్‌, లైక్స్‌ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన నీరజ్‌ అనే రీల్స్‌ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్‌కు చెందిన నీరజ్‌ డిఫరెంట్‌ స్టంట్స్‌ చేస్తూ రీల్స్‌ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్‌ను మరో ట్రాక్టర్‌కు కట్టి లాగే స్టంట్ చేసే ‍ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.

ఈ ఫీట్‌ చేస్తుండగా నీరజ్‌ కూర్చున్న ట్రాక్టర్‌లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్‌ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. 

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)