Breaking News

ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది?

Published on Sat, 03/01/2025 - 12:26

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయణమనగానే ఎవరికైనా ముందుగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు గుర్తుకువస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు ఇందుకోసం ఈ ఆయా నగరాలకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలోని ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 487 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. ఇప్పుడు ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విమానాశ్రయాలు యూపీలో ఎ‍క్కడున్నాయనే వివరాల్లోకి వెళితే..

అయోధ్య
రామజన్మభూమి అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమైన దరిమిలా అక్కడ ‘మర్యాద పురుషోత్తమ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో విదేశీ పర్యాటకులు నేరుగా అయోధ్యకు చేరుకోగులుగుతున్నారు.

నోయిడా  
నోయిడాలోని జెవార్‌లో దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. 40.0919 హెక్టార్ల భూమిలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం సాగింది. ఇక్కడ ఐదు ఐదు రన్‌వేలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

కుషీనగర్‌
కుషీ నగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం  అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.

లక్నో -వారణాసి
యూపీలోని లక్నో, వారణాసిలో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇది  కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)