Breaking News

పతంగుల​కు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి?

Published on Tue, 01/14/2025 - 09:04

నేడు (జనవరి 14) దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే గాలిపటం ఎగురవేయడానికి ఎంత గాలి అవసరమో మీకు తెలుసా?

మకర సంక్రాంతి రోజున భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు. ఈ రోజున ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఈ  గాలిపటాలను చూసినప్పుడు అందరి హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.

ఆకాశంలో గాలి లేకపోతే గాలిపటాలు ఎగరవేయలేమని పలువురు చెబుతుంటారు. ఇంతేకాదు గాలి బలంగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం, కత్తిరించడం కష్టం అవుతుంది. నిజానికి పతంగులు ఎగురవేయడానికి, స్థిరమైన గాలి వేగం గంటకు 8 నుండి 20 మైళ్ళు (13 నుండి 32 కిలోమీటర్లు) మధ్య ఉండాలి. దీనికంటే తక్కువ గాలి వీచినా, గాలిపటాన్ని ఎగురవేయడం కష్టమవుతుంది. అలాగే గంటకు 30 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో వీచే గాలులు కూడా గాలిపటం ఎగరవేయడానికి  ఇబ్బందికరంగా మారుతుంది.

ఆకాశంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటే, గాలిపటం ఎగురవేయడం కష్టమవుతుంది. నిజానికి బలమైన గాలి వీచినప్పుడు గాలిపటం వెంటనే గాలిలో ఎగురుతుంది.  ఇంతేకాదు మాంజాను గాలిపటానికి సరిగ్గా కట్టకపోయినా, గాలిపటం వేగంగా ఎగురుతుంది. అయితే బలమైన గాలులకు గాలిపటం ఆ గాలితో పాటు ముందుకు కదులుతుంది. అయితే అప్పుడు ఆ గాలిపటాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఇంతేకాదు బలమైన గాలిలో మీ గాలిపటంతో మరొక గాలిపటాన్ని  కట్‌చేయలేరు. గాలి వేగం పెరుగుతున్నప్పుడు, గాలిపటాన్ని వెనక్కి లాగే సందర్భంలో  అది చినిగిపోతుంది. ఎందుకంటే గాలి దానిని ముందుకు నెట్టివేస్తుంటుంది. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)