Breaking News

మహాత్మా గాంధీ మనవడు కన్నుమూత

Published on Tue, 05/02/2023 - 12:45

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాత్మా గాంధీ మనవడు అరుణ్‌ గాంధీ(89) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మరణించినట్లు ఆయన కుటుంబికులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొల్హాపూర్‌కు వచ్చిన అరుణ్‌ గాంధీ.. అక్కడే పదిరోజుల పాటు బస చేయాలని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి బయలుదేరే ముందే అరుణ్ గాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ తదుపరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించడంతో అరుణ్‌ గాంధీ అక్కడ ఉండిపోయారని, ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్‌ గాంధీ కుమారుడు తుషార్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

కాగా, మహాత్మా గాంధీ కొడుకు మణిలాల్‌ గాంధీ, సుశీ మష్రువాలా దంపతులకు అరుణ్‌ గాంధీ ఏప్రిల్‌ 14, 1934న డర్బన్‌లో జన్మించారు. అరుణ్‌ గాంధీ సామాజిక కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లోనే నడిచారు.  ఈమేరకు ఈ విషయాన్ని అరుణ్‌ గాంధీ కుమారుడు తుషార్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. 

(చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ)
 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)