డ్రైవర్‌ లేకుండా దూసుకెళ్లిన బైక్‌‌.. ‘దెయ్యం పట్టిందా ఏంటి’

Published on Wed, 08/11/2021 - 19:35

ముంబై: మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్ ప్రాంతం.. రోడ్డుపై అడపాదడపా వాహనాలు వెళుతున్నాయి. పెద్దగా రద్దీ లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇంతలో ఎరుపు రంగులో ఉన్న ఓ బైక్ రయ్యిమంటూ రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఎవరబ్బా.. ఇంత స్పీడ్‌గా రోడ్డుగా మీదకు వచ్చింది అని చూస్తే.. షాక్‌. బైక్‌ మీద ఎవ్వరు లేరు. వార్ని డ్రైవర్‌ లేకుండా ఇంత స్పీడ్‌గా రోడ్డు మీదకు దూసుకువచ్చింది.. బైక్‌కు ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి అనుకున్నారు దాన్ని చూసినవారు. ఇంతలో ఓ వ్యక్తి తేరుకుని రోడ్డు మీదకు వచ్చి ఇతరులను అప్రమత్తం చేశాడు.

బైక్‌ అలా స్పీడ్‌గా వెళ్తుండగా.. అనుకోకుండా దానికి ఎదురుగా ఓ జీపు వేగంగా ముందుకు వచ్చింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి..బ్రేక్ వేశాడు. బైక్ దానికి కొద్దిగా ఢీకొని…ఏకంగా టర్న్ తీసుకుంది..కొద్దిదూరం వెళ్లి కింద పడిపోయింది. డ్రైవర్‌ లేని ఈ బైక్‌ రోడ్డుపై సుమారు 300 మీటర్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఏముంది కొన్ని క్షణాల పాటు జనాలను హడలెత్తించింది బైక్‌. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. దీన్ని చూసిన వారు ‘‘డ్రైవర్‌ లేకుండా బైక్‌ నడవడం ఏంటి.. కొంపదీసి దీన్ని ఏమైనా దెయ్యం ఆవహించిందా.. ఏంటి’’ అని కామెంట్‌ చేయసాగారు నెటిజనులు. 

అయితే కొందరు ఈ డ్రైవర్‌లెస్‌ బైక్‌ జర్నీ గురించి వివరించారు కొందరు. ఈ బైక్‌ ప్రమాదవశాత్తు రోడ్డుమీద వెళుతున్న మరో వ్యక్తిని ఢీకొనడంతో దాన్ని నడిపే అతడను కిందపడిపోయాడని తెలిపారు. అయితే..బైకర్ కిందపడిపోయినా..బైక్ మాత్రం ముందుకు దూసుకెళ్లిందని వెల్లడించారు.. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Videos

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)