Breaking News

Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..

Published on Wed, 03/12/2025 - 19:41

చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ కీలక వ్యాఖ్యాలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పని సరిగా తమిళంలో చదవడం, రాయడం వ‌చ్చి ఉండాల‌నే అభిప్రాయం వ్యక్తం చేసింది.  

తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాలంటే తప్పని సరిగా తమిళ భాష పరీక్ష (Tamil Language Test)లో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఉద్యోగానికి అనర్హులు. టీఎన్ఈబీ నిర్వ‌హించిన త‌మిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్య‌ర్థి ఇదే అంశాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌పై విచార‌ణ స‌మ‌యంలో హైకోర్టు కోర్టు ధ‌ర్మాస‌నం తమిళ మాతృభాష గురించి ప్రస్తావించింది.

త‌మిళ‌నాడు రాష్ట్రం తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగి. అయితే జైకుమార్ రెండేళ్ల‌లో త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సింది. కానీ పాస‌వ్వ‌లేదు. దీంతో విద్యుత్ శాఖ అత‌న్ని విధుల నుంచి తొల‌గించింది. త‌మిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫెయిల్ కావ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగం కోల్పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌మిళ‌నాడు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తన తండ్రి నావల్ సర్వీస్‌లో పని చేయడం వల్ల తాను సీబీఎస్‌ఈ స్కూల్లో చదివానని, అందువల్ల తాను తమిళం నేర్చుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.  

ఆ పిటిష‌న్‌పై జి జయచంద్రన్, ఆర్ పూర్ణిమా ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా  పిటిష‌న‌ర్‌కు మాతృభాష తమిళం రాకపోవడంపై పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పని చేయగలరు? రోజువారి పనులను ఎలా చేస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష తెలియాలి. అలా లేనిపక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు?’అని బెంచ్ వ్యాఖ్యానించింది.

అభ్యర్థులు ప్రభుత్వ భాష పరీక్షను నిర్ణీత సమయంలో పాసవాలని, తమిళ భాష నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఆరువారాల పాటు వాయిదా వేసింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)