amp pages | Sakshi

సీబీఐపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 08/18/2021 - 12:10

చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్‌, కాగ్‌ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’ విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్‌కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. డీఓపీటీ ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్‌ (డీఓపీటీ)‌కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్‌ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)