Breaking News

మద్రాసు @385

Published on Thu, 08/22/2024 - 07:19

దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి. ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.

తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి( 2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.

రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్‌లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్‌వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.

ప్రతి సంవత్సరం ఆగస్టు 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు  ఏర్పాటు చేస్తారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని  ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. చారిత్రక వారసత్వాన్ని  పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)