Breaking News

డీజిల్‌లో నీళ్లు..కాదు నీళ్లలో డీజిల్‌!

Published on Sat, 06/28/2025 - 05:15

భోపాల్‌: పెట్రోల్‌ బంకుల్లో జరిగే ఇంధన కల్తీ తీవ్రతకు తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా సీఎం మోహన్‌ యాదవ్‌ కాన్వాయ్‌లోని ఎస్‌యూవీలే కల్తీ కాటుకు గురికావడం గమనార్హం. రట్లాంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్‌ యాదవ్‌ గురువారం ఇండోర్‌ నుంచి వాహనాల్లో బయలుదేరారు. రట్లాం వద్దకు వచ్చేసరికి డీజిల్‌ నిండుకోవడంతో అక్కడున్న పెట్రోల్‌ బంకులో వాహనాలకు డీజిల్‌ ఫుల్‌ట్యాంక్‌ చేయించారు.

 అక్కడ్నుంచి ఒక కిలోమీటర్‌ దూరం వెళ్లాయో లేదో వాహనాలన్నీ ముందుకు వెళ్లమని మొరాయించాయి. ఒకటీరెండూ కాదు, ఏకంగా 19 వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బందే వాటిని రోడ్డు పక్కకు నెట్టాల్సి వచ్చింది. రట్లాంలోని సంబంధిత పెట్రోల్‌ బంకులో తనిఖీలు చేపట్టిన అధికారులు డీజిల్‌లో భారీగా నీళ్లు కలిసి ఉన్నట్లు నిర్థారించారు. కాగా, కొద్దిసేపటి తర్వాత ఇండోర్‌ నుంచి తెప్పించిన వేరే వాహనాల్లో సీఎం కాన్వాయ్‌ ముందుకు సాగింది.  
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు