Breaking News

రాజ్‌నాథ్‌ సింగ్‌తో పోరుకు దిగిన నీలమ్‌ ఎవరు?

Published on Sat, 05/04/2024 - 07:41

యూపీలోని లక్నో లోక్‌సభ స్థానానికి ఐదవ దశలో మే 20న ఓటింగ్ జరగనుంది. ఈ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో  ముగిసింది. అయితే ఒకరి నామినేషన్‌పై చర్చ జరుగుతోంది. రాష్ట్రీయ ఉదయ్ పార్టీ నుంచి నీలమ్‌ శర్మ అనే మహిళ తన నామినేషన్ దాఖలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను బీజేపీ తరపున బరిలో దిగిన రాజ్‌నాథ్ సింగ్‌ను ఓడించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.

తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ, పల్లవి పటేల్‌ల మద్దతు తమ పార్టీకి ఉందని ఆమె పేర్కొన్నారు. నీలమ్‌ శర్మ సామాజిక కార్యకర్తగా సేవలందించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. నీలమ్‌ శర్మ గతంలో మేయర్ పదవికి కూడా పోటీ చేశారు.

నీలమ్‌ శర్మ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ఆమె సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. స్టయిలిష్‌ లుక్‌లో ఆమె కారు దిగగానే అక్కడున్నవారు ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆమె పోలీసులతో తాను లక్నో లోక్‌సభ స్థానం నుండి ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినట్లు తెలిపారు. తాను గెలిచిన తర్వాత మీరే  నన్ను సన్మానిస్తారని ఆమె పోలీసులతో అన్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం నీలమ్‌ శర్మ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది  తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆమె తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర​్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని అమలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ కారణంగా ఆమె నామినేషన్‌ చెల్లకపోవచ్చని సమాచారం. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)