Breaking News

కేజ్రివాల్‌ కంటే ఆతిశి నయం

Published on Sat, 11/23/2024 - 05:14

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. 

సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్‌ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాక అరవింద్‌ కేజ్రివాల్‌ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్‌ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్‌ అన్నారు. కేజ్రివాల్‌ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్‌ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే.  

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు