Breaking News

బాలరామునికి బొమ్మల బహుమానం

Published on Wed, 01/03/2024 - 12:09

అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్‌ బ్యాంక్‌’ సిద్ధమవుతోంది. 

వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్‌  చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. 

ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందు​కు  ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 

మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్‌ బ్యాంక్‌ ఎంతో ఆదరణ పొందుతోంది. 
ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)