Breaking News

Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్‌... టూ వీలర్లు, ఫ్రిజ్‌ సేల్స్‌ రయ్‌!

Published on Tue, 05/28/2024 - 04:00

సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్‌ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. 

ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్‌ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) ప్రెసిడెంట్‌ మనీశ్‌ రాజ్‌ సింఘానియా వెల్లడించారు. 

కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్‌ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్‌ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. 

దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్‌ సింగిల్‌ డోర్‌ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్‌ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. 

ఎన్నికల ఖర్చు రికార్డ్‌... 
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్‌లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌)కు చెందిన ఎన్‌. భాస్కరరావు అంచనా వేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)