13 తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్‌!

Published on Sun, 03/10/2024 - 06:10

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈ నెల 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి ఈసీ బృందం ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ నెల 12, 13వ తేదీల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సరిహద్దుల్లో పటిష్ట నిఘా వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్‌ సమీక్షలు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధికారులు కేంద్రం హోం శాఖ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపారు. దాదాపు 97 కోట్ల మంది ఓటర్ల కోసం దేశమంతటా దాదాపు 12.5 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది. ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూల్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)