Breaking News

Times Now and ETG Survey: బీజేపీకి 333 పైమాటే

Published on Sat, 03/09/2024 - 05:25

న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘనవిజయం ఖాయమని టైమ్స్‌ నౌ చానల్‌–ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా ఏకంగా 333 నుంచి 363 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాలదాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది.

ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లొస్తాయని వివరించింది. తమిళనాట డీఎంకేకు 24 నుంచి 28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 10 నుంచి 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్‌సభ స్థానాలున్న పశి్చమబెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి  17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఏడు సీట్లున్న ఢిల్లీలో ఆప్‌ 5 నుంచి మొత్తం 7 స్థానాలూ కొల్లగొట్టవచ్చని సర్వే వెల్లడించడం విశేషం.

యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్‌
అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ ఖాయమని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని, కాంగ్రెస్, సమాజ్‌వాదీలతో కూడిన ‘ఇండియా’ కూటమి 2 నుంచి 6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్‌లోనైతే మొత్తం 26 సీట్లనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని పేర్కొంది.

బిహార్‌లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీ(యూ)తో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమి 2 నుంచి 4 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)లతో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22 నుంచి 24, కాంగ్రెస్‌కు కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని పేర్కొంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)