Breaking News

ఎగ్జిట్‌పోల్స్‌.. ఏం చెబుతాయో!

Published on Sat, 06/01/2024 - 05:10

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే  పోలింగ్‌ ఏజెన్సీలు, న్యూస్‌ ఛానెళ్లు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయనున్నాయి. జూన్‌ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్‌ ఛానెల్‌లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల కానున్నాయి. 

దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్‌ పోల్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)