Breaking News

Lok Sabha Election 2024: ఏడో విడతలో 62 శాతం పోలింగ్‌

Published on Sun, 06/02/2024 - 05:15

న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్‌ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్‌ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు.

 దీంతో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్‌ నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 73.47  శాతం పోలింగ్‌ నమోదైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌ ప్రాంతంలోని మిత్ర ఇన్‌స్టిట్యూట్‌ స్కూల్‌ బూత్‌లో ఓటేశారు. 

బేరామరీలో బాహాబాహీ 
పశి్చమబెంగాల్‌లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్‌హాట్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్‌ఎఫ్‌ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో  పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్‌ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్‌ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి. 

కుటుంబాన్ని మించిన కర్తవ్యం 
80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్‌కులీ గ్రామంలో మిథిలేశ్‌ యాదవ్‌ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్‌ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)