Breaking News

‘హస్తం’, ‘చర్ఖా’ లేకున్నా ఇందిర ప్రభంజనం!

Published on Tue, 03/05/2024 - 12:53

స్వతంత్ర భారతావనిలో జరిగిన ఐదవ సాధారణ ఎన్నికలు దేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలను మార్చివేశాయి. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ హవాను దేశమంతా చూసింది. ఆమె నేతృత్వంలోని పార్టీ లోక్‌సభలో మొత్తం 545 స్థానాలకు గానూ 352 సీట్లు గెలుచుకుంది. నాడు  కాంగ్రెస్ (ఓ)కి 16 సీట్లు మాత్రమే దక్కాయి. 

ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. ఇందిర కాంగ్రెస్ (ఐ) పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌లోని వృద్ధ నాయకులకు వ్యతిరేకంగా తన సత్తా చాటారు. 1951-1952లో స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఈ  ఎన్నికల సంప్రదాయం 1960ల చివరి వరకు కొనసాగింది. అయితే పలు అసెంబ్లీ స్థానాల పదవీకాలం ఇంకా ముగియకపోవడంతో ఎన్నికల తేదీలను ఏడాది పాటు వాయిదా వేయడం వల్ల జాతీయ, రాష్ట్ర షెడ్యూళ్లను వేరు చేయాల్సి వచ్చింది. 

1971లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 1-10 తేదీల మధ్య ఎన్నికలు జరిగాయి. 15,12,96,749 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య 1967 లోక్‌సభ ఎన్నికల కంటే 30 లక్షలు తక్కువ కావడం విశేషం. నాడు 518 స్థానాలకు గాను 2,784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మారిన గుర్తుతో ఇందిర ఎన్నికల్లో పోటీ చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా (కాంగ్రెస్ ‘ఆర్), కాంగ్రెస్ (ఓ)) విడిపోయినప్పుడు జరిగిన మొదటి ఎన్నికలివి. ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ ఎన్నికల గుర్తు ఆవు, పాలు తాగుతున్న దూడ. కాంగ్రెస్ (ఓ) ఎన్నికల గుర్తు చర్ఖా తిప్పుతున్న మహిళ.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)