Breaking News

అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్‌.. విచిత్రమో, విడ్డూరమో కాదు!

Published on Thu, 06/29/2023 - 13:21

రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్‌ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్‌ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎందుకిలా చేస్తారంటే..
చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్‌ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్‌ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్‌ సమాధానమిచ్చారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్‌ ఉండదు. ఓహెచ్‌ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్‌ హెడ్‌ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్‌ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్‌ సెక్షన్‌ అని అంటారు.



కట్‌ కరెంట్‌ ప్రాంతంగా..
ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్‌ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్‌ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్‌ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి.

వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్‌ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి.
ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్‌ మ్యాన్‌’ స్టోరీ!

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)