Breaking News

తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు

Published on Sun, 07/21/2024 - 05:49

న్యూఢిల్లీ: తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్‌ జైలు సూపరింటెండెంట్‌ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్‌ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు శనివారం తెలిపాయి.

 కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్‌ టెస్ట్‌ రీడింగ్‌కు, కంటిన్యువస్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.

ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదు
ఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్‌ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)