Breaking News

చిరుత 'పల్లె' కరింపు

Published on Mon, 08/04/2025 - 06:18

ఆత్మకూరురూరల్‌: చిరుత పులి ఎలాంటి ప్రాంతంలోనైనా ఉండగలదు. దట్టమైన నల్లమలలలోను, చిట్టడవులు మాత్రమే ఉన్న ఎర్రమలలోను, కంప చెట్లు, రాతి కొండలు ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పశి్చమ ప్రాంలో హాయిగా బతికేస్తున్నాయి. అలాగే హైదరాబాదు, బెంగళూరు, ముంబయ్‌ లాంటి నగరాల శివార్లలోనూ జీవించ గలుగుతున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు.  ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల చిరుతల సంచారం కనిపించడం, ప్రజల్లో కొంత ఆందోళన కలగడం జరుగుతోంది  

ఆహారం కోసమే..
గ్రామాల పరిసరాల్లో చిరుతలు సంచరించడం సహజమైనదే. చిన్న­పాటి దాక్కునే ప్రదేశం ఉన్నా చిరుతలు తమనుతాము దాచుకుని ఎవరికి కనిపించకుండా మనుగడ సాగించగలవు. పంట పొలాల్లో ఉండే కుందేళ్ళు, అడవి పందుల పిల్లల వంటి వన్యప్రాణులతో పాటు గ్రామా­ల్లోని కుక్కలను ఆహారంగా తీసుకుంటాయి.  ఇటీవలి కాలంలో రాళ్ల కొండల్లో, పొదల్లో చిరుతల ఆహారం తగ్గి పోవడంతో అనివార్యంగా గ్రామాల వైపు చిరుతలు వస్తూ జనం కంట పడుతున్నాయి. గొర్ల మందల వద్ద ఉన్న కుక్కలను, ఆవుల మందల్లో ఉండే దూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతలు ఆహార సేకరణ చేస్తుంటాయి.

ఇదీ కారణం..  
శ్రీశైలం మహాక్షేత్రంలో ఇటీవల చిరుత పులులు కాలనీల్లోని ఇళ్లలోకి కూడా వచ్చాయి. దీన్ని సునిశితంగా పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు దీనికి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ అనే వైరస్‌ సంబంధిత వ్యాధి కారణమని తేల్చారు. ఆఫ్రికన్  స్వైన్‌ ఫ్లూ వైరస్‌ పందులలో సంక్రమిస్తుంది. సున్నిపెంటలో కొందరు నడుపుతున్న పందుల ఫాంలోకి  బెంగళూరు నుంచి తెచ్చిన పందుల వల్ల ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ చేరింది. ఈ పందులనుంచి ఆ వైరస్‌ అడవి పందులపై ప్రభావం చూపడంతో పెద్ద సంఖ్యలో అడవి పందులు మరణించాయి.

పంది పిల్లలే ముఖ్య ఆహారంగా తీసుకునే చిరుతలకు దీనివల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీంతో చిరుతలు అనివార్యంగా కుక్కలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని శ్రీశైలంలోకి తరుచూ వచ్చేవి.  శ్రీశైలం దేవస్థానం వారు చిరుత ఆహారపు కొరతను గమనించకుండా  పుణ్యక్షేత్రంలో సంచరించే కుక్కలను పట్టి వేరే ప్రాంతంలో వదిలారు. దీంతో చిరుతలు సున్నిపెంటల్లో ఇళ్లలో పెంచుకునే పెట్‌ డాగ్స్, ఇతర పెంపుడు జంతువులకోసం ఏకంగా ఇళ్ళలో ప్రవేశించ సాగాయి.  

రైతులకు ఎంతో మేలు
చిరుత పులులు అడవి పందులను తిని రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అడవి పందులు తమ సంతతిని విపరీతంగా పెంచుకుని మైదాన ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇవి రైతుల పంటలను సర్వ నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అ­యితే అడవి పంది పిల్లలను అమిత ఇష్టంగా వేటాడి తినడం చి­రు­త ప్రత్యేకత. అందుకే చిరుత పులులు రైతుల పొలాల వెంట సంచ­­రిస్తూ పంది పిల్లల కోసం మాటు వేస్తుంటాయి. అలా పందులసంఖ్యను  నియత్రించడం ద్వారా చిరుతలు రై­తు­లకు మేలు చేస్తుంటాయి. కాగా.. చిరుత పులి తన ఆ­హా­ర జంతువుల జాబితాలో మనిíÙని ఎంచుకోలేదు. రెండు కాళ్ల జంతువులు పులుల ఆహారపు మెనూలోనే లేవు.  

కోసిగి ప్రాంతంలో ఇటీవల ఒక చిరుత పంట పొలాల్లో మత్తుగా పడి ఉండడం స్థానికులు గమనించారు. దాన్ని వెంటాడి బంధించే ప్రయత్నం చేశారు. ఆ చిరుత పులి ఆ తరువాత మరణించింది. దాన్ని పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు తేలి్చన సత్యం ఏమిటంటే అది ఏదో జంతువును వేటాడినపుడు ఎముక ఒకటి దాని పేగులకు పొడుచుకుని ఇన్‌ఫెక్షన్‌కు గురైంది.  అది పడుకుని ఉండగా బంధించే యత్నం చేయడంతో ఆ జంతువు ఆందోళనకు గురై హృదయ స్పందన ఆగి మృతిచెందింది. 

ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. అడవిలో ఆహారపు కొరతతోనే అవి గ్రామాలవైపు వస్తున్నాయి.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ శివారులో ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడం ఇటీవల సంచలనం రేపింది. తాను వేటాడిన ఆహారాన్ని దాచుకునేందుకు చిరుతలు చెట్లు ఎక్కుతుంటాయి. అలాగే ఇతర జంతువుల నుంచి ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా చెట్లు ఎక్కుతుంటాయి. అయితే తిప్పలదొడ్డి వద్ద ప్రజల సందడికి భయపడి రక్షణ కోసం చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)