Breaking News

హోలీ రంగులు వద్దనుకుంటే దేశం విడిచి వెళ్లండి 

Published on Fri, 03/14/2025 - 06:32

గోరఖ్‌పూర్‌: హోలీ అంటే ఇష్టంలేనివారు, రంగులంటే పడనివారు దేశం విడిచి వెల్లాలని యూపీ మంత్రి, నిషాద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషాద్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది హోలీ.. రంజాన్‌ మాసంలోని శుక్రవారం రోజే వచ్చింది. దీంతో హోలీ వేడుకలకు అసౌకర్యం కలగకుండా ముస్లింలు మధ్యాహ్నం వరకు ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వస్తే టార్పాలిన్‌తో కప్పుకోవాలని యూపీ, బీహార్‌లోని కొందరు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో హోలీ మిలన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిషాద్‌ మాట్లాడుతూ.. సమాజంలో విభేదాలు సృష్టించేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హోలీ వేడుకలతో మతాన్ని ముడిపెట్టి ప్రజలన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారని, హøలీ ఆడేటప్పుడు కూడా అలాగే చేస్తారని చెప్పుకొచ్చారు. 

రెండూ ఐక్యతకు సంబంధించిన పండుగలే అయినా కొందరు రాజకీయ నాయకులు ఈ ఐక్యతను కోరుకోవడం లేదని, ఒక వర్గానికి చెందిన ప్రజల మనస్సులను విషపూరితం చేస్తున్నారని ఆరోపించారు. వారు కూడా ఈ దేశం పౌరులేనని, రంగులతో సమస్యలుంటే వారు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు. రంగులు పూస్తే తమ విశ్వాసాలు దెబ్బతింటాయని భావిస్తారని, మరి రంగురంగుల దుస్తులు ఎలా ధరిస్తున్నారని ప్రశ్నించారు. రంగుల వ్యాపారులు సైతం ఆ సామాజిక వర్గానికి చెందినవారేనని వెల్లడించారు. పండుగలు ఆనందాన్ని పంచడానికి, ఐక్యతను వ్యాప్తి చేయడానికి ఉద్దేశించినవన్నారు.  
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)