Breaking News

‘సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్‌

Published on Mon, 10/21/2024 - 22:02

ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు ప‌ల‌కాల‌ని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసుల‌కు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరించి త‌ప్పు చేసిన‌ట్లు మ‌రో వాట్స‌ప్ మెసేజ్ పంపించాడు. ప్ర‌స్తుతం ఈ అంశం బీటౌన్‌లో చ‌ర్చనీయాంశంగా మారింది 

వారం రోజుల క్రితం సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హ‌త్య జ‌రిగింది. హత్యోదంతం త‌ర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హ‌త్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో స‌ల్మాన్‌కు వైరానికి ముగింపు ప‌ల‌కాల‌ని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి ప‌ట్టిన గ‌తి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపుల‌కు దిగాడు.  

దీంతో అప్ర‌మ‌త్త‌మైన ముంబై పోలీసులు స‌ల్మాన్ ఖాన్‌కు హైసెక్యూరిటీ మ‌ధ్య భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌ల్ని ముమ్మ‌రం చేశారు. ఈ త‌రుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గ‌త‌వారం స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు మ‌రో మెసేజ్ పంపించాడ‌ని, స‌ల్మాన్ ఖాన్‌ను బెదిరించి త‌ప్పు చేసిన‌ట్లు చెప్పాడ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. 
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు