Breaking News

హస్తినలో ‘బంగారు బోనం’

Published on Thu, 07/11/2024 - 04:08

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. లాల్‌ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బుధవారం రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు లాల్‌దర్వా­జ అమ్మవారి బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. 

అనంతరం గవర్నర్‌ బంగారు బోనాన్ని ఎత్తుకుని సింహవాహిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడు ఒక్కడేనని.. భిన్న రూపాల్లో మనం దేవుడిని కొలుస్తామని అన్నారు. ఇదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో ఈ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుందని గవర్నర్‌ రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేంద్రయాదవ్, ఇతర ముఖ్యులు గవర్నర్‌కు జ్ఞాపికను అందించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కర్తవ్యపథ్‌ నుంచి తెలంగాణభవన్‌ వరకు నిర్వహించిన అమ్మవారి ఘట ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు డోలు, డప్పు దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు