Breaking News

Kuwait Fire Incident: భారత్‌కు చేరుకున్న‘కువైట్‌’ బాధితుల మృతదేహాలు

Published on Sat, 06/15/2024 - 05:26

కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా 23 మంది కేరళీయులు ఉన్నారు. మృతుల్లో కర్ణాటక సంబంధించి ఒకరు, తమిళనాడుకు చెందిన ఏడుగురి మృతదేహాలనూ తీసుకొచ్చారు. మృతదేహాలను తొలుత శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానా శ్రయానికి తీసుకొచ్చారు.

 ఎయిర్‌పోర్ట్‌లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వారికి నివాళులర్పించారు. ‘‘ జీవనోపాధి కోసం విదేశం వెళ్లి విగతజీవులైన బడుగుజీవుల కష్టాలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవాలి. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం సరిపోదు’ అని సీఎం అన్నారు. కువైట్‌ నుంచి మృతదేహాల తరలింపు ప్రక్రియను దగ్గరుంచి చూసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌తోపాటు తమిళనాడు మైనారిటీ సంక్షేమ మంత్రి కేఎస్‌ మస్తాన్‌లు సైతం పార్థివదేహాల వద్ద నివాళులర్పించారు.

మృతుల్లో ముగ్గురు తెలుగువారు
అగ్నిప్రమాదంలో ముగ్గురు తెలుగువ్యక్తులు సైతం చనిపోయారని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌– రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి. లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణ, ఎం.ఈశ్వరుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ పేర్కొంది. ‘‘ సొంత పనిమీద స్వదేశానికి వచ్చిన లోకనాథం తిరిగి కువైట్‌ బయల్దేరారు. స్వస్థలం నుంచి తొలుత జూన్‌ 5న హైదరాబాద్‌కు వచ్చి నాలుగు రోజులు ఉండి తర్వాత జూన్‌ 11న కువైట్‌ చేరుకున్నారు. ఆయన భవంతికి వచ్చి బసచేసిన అదే రోజున అగ్నిప్రమాదం జరిగి తుదిశ్వాస విడిచారు’’ అని లోకనాథం బంధువు శాంతారావు చెప్పారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)