Breaking News

‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్‌ కమ్రా క్వాష్‌ పిటిషన్‌

Published on Mon, 04/07/2025 - 09:51

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై (Eknath Shinde) నోరు పారేసుకున్న స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ (quash petition) దాఖలు చేశారు.  

‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్‌  కమ్రా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ‘గద్దార్‌’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెల‌రేగింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ శివ‌సేన ఎమ్మెల్యే ముర్జీ ప‌టేల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ముర్జీ ప‌టేల్ ఫిర్యాదు మేర‌కు కునాల్ క‌మ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు చేశారు.

అయితే, ఈ త‌రుణంలో ఇవాళ  శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో కోరారు.

అంత‌కుముందు, తాను చేసిన వ్యాఖ్య‌లపై అంతేకాదు చ‌ట్ట బ‌ద్ధంగా త‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా స‌హ‌కరించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన త‌ర్వాత ఏప్రిల్ 1న న‌మోదైన మూడు ఎఫ్ఐఆర్‌ల‌పై ఖార్ పోలీస్‌స్టేష‌న్‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని  కునాల్‌ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)