కోల్‌కతాలో ట్రామ్‌లకు సెలవు

Published on Wed, 09/25/2024 - 04:30

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ట్రామ్‌లు. రహదారుల మధ్యలో పట్టాల మీదుగా పరుగులు తీసే ట్రామ్‌ల్లో ప్రయాణించడం ఒక మధురమైన జ్ఞాపకం. నగరంలో 150 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రామ్‌ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్‌ రవాణా శాఖ మంత్రి స్నేహశిష్‌ చక్రబర్తి వెల్లడించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆధునిక కాలంలో నగరంలో వేగవంతమైన ప్రయాణ సాధనాల అవసరం నానాటికీ పెరుగుతోందని అన్నారు.

 తక్కువ వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల రోడ్లలో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, తరచుగా ట్రాఫిక్‌ జామ్‌ల వల్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ట్రామ్‌ల సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘ట్రామ్‌లు 1873 నుంచి కోల్‌కతా సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. కానీ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇకపై ట్రామ్‌లను నడపలేం’’ అన్నారు.

పలు మార్గాల్లో వాటినిప్పటికే పూర్తిగా నిలిపేసినట్లు గుర్తుచేశారు. మిగిలిన మార్గాల్లోనూ ముగింపు పలుకుతున్నట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తప్పించాలన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని వివరణ ఇచ్చారు. కేవలం మైదాన్‌– ఎస్‌ప్లాండే హెరిటేజ్‌ మార్గంలో మాత్రమే ఇకపై ట్రామ్‌లు నడుస్తాయని చెప్పారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)