Breaking News

ట్రైనీ డాక్టర్‌ హత్య కేసు.. మరొకరి ప్రమేయం ఉందా?

Published on Tue, 08/13/2024 - 12:46

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకేసులో పలు అనుమానాలు, అటాప్సీ రిపోర్ట్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం (ఆగస్ట్‌13) ట్రైనీ డాక్టర్‌ ఆటాప్సీ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది.  

అటాప్సీ రిపోర్ట్‌ ఆధారంగా..నిందితుడు సంజయ్‌ రాయ్‌ ట్రైనీ డాక్టర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రాణాలు తీసినట్లు తేలింది. అమానుషంగా లైంగిక దాడి కారణంగా బాధితురాలి అంతర్గత శరీర భాగాల్లో ఏర్పాడిన గాయాల కారణంగా రక్త స్త్రావమైంది. ఆగస్టు 9 తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య హత్య, అత్యాచారం జరిగి ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

నిందితుడి సంజయ్‌ రాయ్‌ నుంచి తప్పించుకునేందుకు ట్రైనీ డాక్టర్‌ ప్రతిఘటించడంతో ఆమె ఉదరం, పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై గాయాలయ్యాయని, నిందితుడు నుంచి చెరనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిలువరించేందుకు ఆమె తలను గోడకు బాదాడు. దారుణానికి ఒడిగట్టే సమయంలో అరుపులు వినపడకుండా ఉండేందుకు నోరు, గొంతు బిగించాడు. దీంతో ఆమె మెడ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. అయితే, ఆమె కంటికి గాయం కావడానికి గల కారణాల్ని ఇంకా గుర్తించలేదు.

ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్‌ కాల్‌
మరోవైపు దారుణం వెలుగులోకి వచ్చిన రోజు ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్‌ కాల్‌ చేసింది అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ అని మీడియా కథనాలు చెబుతున్నాయి.  

సంజయ్‌ రాయ్‌ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?
దీంతో ఇదే అంశంపై సూపరింటెండెంట్‌ను విచారించేందుకు పోలీసులు ఇవాళ లాల్‌బజార్‌ పీఎస్‌కు పిలిపించారు. తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్‌ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజయ్‌ రాయ్‌తో పాటు ఇంకెవరైనా ఉన్న అన్న కోణంలో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు