Breaking News

‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!

Published on Tue, 06/06/2023 - 11:05

కోల్‌కతా నుంచి దోహా వెళుతున్న కతర్‌ ఎయిర్‌వేస్‌లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్‌ ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్‌కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.

వివరాల్లోకి వెళితే కతర్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్‌541, విమానం కోల్‌కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్‌ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్‌ఎఫ్‌కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్‌ఎఫ్‌ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్నిఫర్‌ డాగ్స్‌ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు.  

ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు.  కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  

చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్‌కేజీ ఫ్రెండ్‌ను కనిపెట్టిందిలా..

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)