కేరళలో ప్రభుత్వ వాహనాలకు ఒకే సిరీస్ రిజిస్ట్రేషన్

Published on Sat, 11/01/2025 - 12:52

తిరువనంతపురం: ప్రభుత్వ వాహనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ఏకరూపత పాటించాలని నిర్ణయించింది. ఇకపై రిజిస్ట్రేషన్ చేయించే ప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90’ సిరీస్‌ను కేటాయించాలంటూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రప్రభుత్వ వాహనాలను ‘కేఎల్90’, ‘కేఎల్90డీ’ సిరీస్‌లలో రిజిస్టర్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90ఏ’, ‘కేఎల్90ఈ’, ‘కేఎల్90బీ’ సిరీస్‌లను కేటాయిస్తారు. స్థానిక సంస్థల వాహనాలకు కేఎల్90ఎఫ్’ సిరీస్, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, విశ్వవిద్యాలయాల వాహనాలకు ‘కేఎల్90సీ’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్లు చేస్తారు.

ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఈరోజు(నవంబరు 1) నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. అయితే.. ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. ప్రభుత్వ వాహనాలన్నీ తిరువనంతపురంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో.. 9వ నంబర్ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) వింగ్ వద్ద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ వాహనాలకు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లు జరిగేవి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)