Breaking News

kenya: అంత్యక్రియలకు వెళుతూ అనంత లోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 25 మంది మృతి

Published on Sat, 08/09/2025 - 09:09

నైరోబి: కెన్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యే వారిని తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడి, 25 మంది మృతి చెందారు. నైరుతి కెన్యాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడి గుంతలోకి ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ బస్సు కాకామెగా పట్టణం నుండి కిసుము నగరానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. న్యాంజా ప్రావిన్స్ ప్రాంతీయ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన వివరాల ప్రకారం బస్సు అధిక వేగంతో వెళుతోందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో 25 మంది మృతిచెందారని కెన్యాలో వైద్య సేవల ప్రధాన కార్యదర్శి ఫ్రెడ్రిక్ ఓమా ఒలుగా తెలిపారు.

ఈ ప్రమాదం ఈ ప్రాంతంలోని వారిని ఆందోళనకు గురిచేసింది.  కాగా కెన్యా,  తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.  ఇక్కడి రోడ్లు ఇరుకుగా, అనేక గుంతలతో  ఉండటంతోనే ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాల అతివేగం కూడా ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది దీనికి ముందు నకురు కౌంటీలోని నైవాషాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఈ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు.

#

Tags : 1

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు