Breaking News

తీహార్‌ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్‌ మరో సందేశం

Published on Wed, 04/10/2024 - 16:26

ఢిల్లీ, సాక్షి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్‌ జైలు నుంచి మరో సందేశం ఇచ్చారు. కేజ్రీవాల్ సలహా మేరకు ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హటావో దివస్’(Samvidhan Bachao,Tanashahi Hatao Divas) ను పాటించనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ  ప్రకటించింది . 

అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆప్ నాయకులు, కార్యకర్తలు ‘నియంతృత్వాన్ని’వ్యతిరేకిస్తామని, రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేయాలని సీఎం కేజ్రీవాల్‌ ఆదేశించినట్లు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘నియంతృత్వాన్ని’ ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్‌ సూచించారని అన్నారు.  

దీంతో పాటు ఢిల్లీ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా పని చేయాలని ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లను కేజ్రీవాల్ కోరినట్లు ఆ పార్టీ ఎంపీ గోపాల్ రాయ్ అన్నారు. 

రాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను మంగళవారం తీహార్ జైలులో కలిశారని చెప్పారు. సునీతా కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్న పార్టీ సమావేశంలో ఆయన సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)