Breaking News

Kartik Purnima: వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు

Published on Fri, 11/15/2024 - 08:13

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు(నవంబర్‌ 15) కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ నెలకొంది.

యూపీలోని అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదేవిధంగా యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్‌ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ రోజున వారణాసిలో దేవ్‌ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు  విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.
 

కాగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పూర్ణిమ, గురునానక్ దేవ్‌ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశభక్తుడని ఆయన  కొనియాడారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్‌ కృషి చేశారని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్‌ జయంతి ఎందుకు చేస్తారంటే..

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)