Breaking News

బీజేపీకి అచ్చిరాని 13! గతంలోనూ ఇలా..

Published on Sat, 05/13/2023 - 18:01

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో దూసుకుపోయే పాశ్చాత్య దేశాలు సైతం వణికిపోచే నెంబర్‌ 13. దురదృష్ట సంఖ్యగా, అపశకునంగా భావిస్తాయి చాలా దేశాలు(మన దేశంలో కాదులేండి). అందుకే ఆ నెంబర్‌కు దూరంగా ఉండే యత్నం చేస్తుంటారు. అయితే ఈ నెంబర్‌ భారతీయ జనతా పార్టీకి కూడా అచ్చిరాదేమో అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్‌ ఇవాళ్టి(మే 13వ తేదీ) కర్ణాటక  ఎన్నికల ఓటమి ఫలితంతో బలపడగా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గమనిస్తే.. 


👉 దేశంలో తొలి కాంగ్రెసేతర ప్ర‌భుత్వాన్ని వాజ్‌పేయి నేతృత్వంలో 1996 మే 16వ తేదీన ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, మెజార్టీని నిరూపించుకోలేక‌పోవ‌డంతో కేవ‌లం 13 రోజుల్లోనే ప్ర‌ధాని ప‌ద‌వికి వాజ్‌పేయి రాజీనామా చేశారు.

👉 1996-1998 మధ్న రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడియాయి. ఆపైత‌ లోక్‌సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుని ఎన్టీయే కూటమిగా ఏర్పడిన బీజేపీ..  వాజ్‌పేయిని మళ్ళీ ప్రధానిని చేసింది. కానీ, ఏడాది తిరిగాక.. కూటమికి పగళ్లు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన‌ జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవ‌డంతో మ‌రోసారి అట‌ల్‌జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న‌ జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క‌ ఓటుతో ఓడిపోవ‌డంతో ప్ర‌ధాని ప‌ద‌వికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. అలా రెండోసారి వాయ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ కూడా కేవ‌లం 13 నెలల కాలం కొన‌సాగింది.

👉 ఇక మే 13వ తేదీ సైతం బీజేపీ కలిసి రాలేదేమో!. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ ఓటమి పాలైంది. అయితే అప్పుడు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది మే 13వ తేదీనే. 

👉 2004లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 13 సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుందో ఏమో.. ఆ ఏడాది అక్టోబర్‌ 13వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ అప్పట్లో బీజేపీ అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ తేదీన సర్వ ప్రీతి అమవాస్య ఉందని, హిందువులకు పవిత్రమైన ఆ తేదీన ఎన్నికలు జరపొద్దని కోరింది. కానీ, ఈసీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు.  ఆ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓటమిపాలైంది. 

👉 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 ఫలితం రిపీట్‌ అయ్యింది. మే 13 అంటే ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో  అధికార పార్టీ హోదాలో బీజేపీ కన్నడనాట దారుణంగా ఓటమి పాలైంది. దీంతో 13 సెంటిమెంట్‌ బీజేపీ శ్రేణుల్లో మరింత బలపడే ఛాన్స్‌ కనిపిస్తోంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)