Breaking News

karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు

Published on Fri, 04/28/2023 - 06:26

శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్‌ హెచ్‌డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా.

మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్‌డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)