Breaking News

అడుగడుగునా అవమానించే హోటల్‌కు జనం క్యూ!

Published on Mon, 02/26/2024 - 11:51

అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్‌లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్‌ లేదు. దాని హ్యాండిల్‌ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. 

ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. 

‘డైలీ మెయిల్‌’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్‌ చేసే​ ఈ హోటల్‌లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్  కూడా ఉండవు. హోటల్‌లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్‌ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్‌ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత  ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్‌ అంతటా తమ శాఖలను నెలకొల్పింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)