Breaking News

‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం!

Published on Sat, 01/13/2024 - 10:58

అది.. 1992, డిసెంబర్.. దేశం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కరసేవకుల బృందం కూడా అయోధ్యకు తరలివచ్చింది. వారిలో జోధ్‌పూర్ నివాసి కన్రాజ్ మొహ్నోత్ కూడా ఉన్నారు.  

నాటి ఆ ఉద్యమం గురించి కన్రాజ్ మొహ్నోత్ మాట్లాడుతూ ‘ఆ సమయంలో కరసేవకులు  ఉత్సాహంతో అయోధ్యవైపు పయనవుతున్నారు. ఇదే సందర్భంలో రైళ్లలో ముమ్మర తనిఖీలు జరిగాయి. పలువురిని పోలీసులు విచారించారు. కొన్ని చోట్ల కరసేవకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మేము అయోధ్య కన్నా ముందుగా వచ్చే  ఒక స్టేషన్‌లో దిగాం. అనంతరం బృందాలుగా ఏర్పడి, కాలినడకన రహస్యంగా హనుమాన్‌నగర్‌ చేరుకున్నాం. 

ఉద్యమ సమయంలో మృత్యువుకు దగ్గరగా వెళ్లిన రోజు నాకింకా గుర్తుంది. తుపాకీ బుల్లెట్ నా చెవిని దాటి వెళ్లింది. శ్రీరాముని దయతో అపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాను. అయితే ఆ బుల్లెట్ నా వెనుకనున్న కరసేవకుడు సీతారామ్ పరిహార్‌కి తగిలింది. ఆ ప్రదేశంలో ఆసుపత్రి ఎక్కడుందో మాకు తెలియలేదు. అక్కడున్న స్థానికులు కూడా మాకు సహాయం చేయలేదు. చివరకు గంటన్నర పాటు మృత్యువుతోపోరాడిన సీతారాం చనిపోయాడు. ప్రొఫెసర్‌ మహేంద్రనాథ్ అరోరా కూడా ఇదేవిధంగా ప్రాణత్యాగం చేశారు. వారిద్దరి మృతదేహాలను అయోధ్య నుంచి వ్యాన్‌లో వారి స్వస్థలమైన జోధ్‌పూర్‌కు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశాం. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత అయోధ్య రామాలయం కల నెరవేరింది’ అని అన్నారు. 
ఇది కూడా చదవండి: అయోధ్యలో ‍‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)